తెలంగాణ ప్రాంతంలో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ దృష్టి పెట్టింది. కిషన్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న పార్టీ తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చిం చింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ దృష్టి పెట్టింది. కిషన్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న పార్టీ తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చిం చింది. తెలంగాణలోని 17లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు పార్టీ జిల్లా కమిటీల నుంచి అందిన ప్రతిపాదనలపై చర్చించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడేసి పేర్లను జాతీయ పార్టీకి సూచించాలని నిర్ణయించారు. నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ లోకసభ స్థానాలకు ఒక్కొక్క అభ్యర్ధి పేరే జిల్లా కమిటీల నుంచి అం దినట్టు సమాచారం. మెదక్ లోకసభ స్థానం నుంచి నరేంద్రనాథ్, నిజామాబాద్ నుంచి యెండల లక్ష్మీనారాయణ, మహబూబ్‌నగర్ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి పేర్లపై సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చిందని సమాచారం.
ఎన్నికల కమిటీ నుంచి వారికి ఉద్వాసన
వెంకయ్యనాయుడుపై విమర్శలు చేసిన శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్‌లను పార్టీ ఎన్నికల కమిటీ నుంచి తొలగించారు. అలాగే, మరోనేత రామచంద్రరావును కూడా తప్పించారు. వీరి స్థానంలో మురళీధరరావు, యెండల, దత్తాత్రేయ, లక్ష్మణ్, విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, ఆచారి, చింతా సాంబమూర్తి, పద్మజారెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు.