ముందుచూపు లేకే విద్యుత్ సంక్షోభం
కొత్తూరుః తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య నానాటికి తీవ్రమవుతున్నా పరి ష్కారానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాం టి చర్యలు చేపట్టడం లేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తూరులో విలేకరులతో మాట్లాడుతూప్రస్తుతం శ్రీశైలం, సాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి తగ్గడంతో కోతలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేయూలనే ఆలోచన రాకపోవడమే ఇందుకు కారణమన్నారు. ముఖ్యమంత్రి సంక్షోభంనుంచి గట్టెక్కాలనే దానిపై ఆలోచననే చేయడంలేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలి
ప్రభుత్వం రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయూలని, నిర్ణీత గడువును ప్రకటిస్తూ గ్రామాల్లో దండోరా వేరుుంచాలన్నారు. లేని పక్షంలో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి కుటుంబం బ్యాంకుల్లో ఖాతా తెరిచి జన్‌ధన్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
స్థానికతపై కేసీఆర్ తీరు బాధాకరం
విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్‌పై కేసీఆర్ ప్రకటించిన స్థానికత పలువురికి ఇబ్బందులు కలిగించేలా ఉందని నాగం పేర్కొన్నారు. కొత్తూరు వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం అనంతరం అయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు హైద్రాబాద్‌లో నివాసం ఏర్పరచుకున్నారన్నారు. అరుుతే ప్రతి విద్యార్థి స్థానికతను రుజువు చేసుకుంటేనే రీరుుంబర్స్ చెల్లిస్తామనడం దారుణమన్నారు. 17 సెప్టెంబర్‌ను విమోచనదినంగా జరపాలని గత ప్రభుత్వాలను కోరిన కేసీఆర్ తన హయంలో ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ కేవలం ఓట్లకోసమే ఎంఐఎంకు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీవర్థన్‌రెడ్డి, సత్యనారాయణ, దేపల్లి ఆశోక్‌గౌడ్, మాణిక్యం, అమడపురం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.