'అసదుద్దీన్ కు మోదీ భయం పట్టుకుంది' | indrasena reddy slams on telangana government | Sakshi
Sakshi News home page

'అసదుద్దీన్ కు మోదీ భయం పట్టుకుంది'

Published Tue, Jul 21 2015 2:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'అసదుద్దీన్ కు మోదీ భయం పట్టుకుంది' - Sakshi

'అసదుద్దీన్ కు మోదీ భయం పట్టుకుంది'

హైదరాబాద్: కుహనా లౌకిక వాదులు సంస్కృతి మరచి పుష్కరాలపై రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వం ఇతర మతాలకు సబ్సిడీ ఇస్తే ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. హిందూ దేవాలయాల డబ్బును ప్రభుత్వం వాడుకున్నపుడు ఈ లౌకిక వాదులు ఎమయ్యారన్నారు. అసదుద్దీన్ కు ప్రధాని మోదీ భయం పట్టుకుందన్నారు. ముంబై అల్లర్లను అసదుద్దీన్ సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏసీబీ సత్తయ్యను హత్య చేసిన వ్యక్తికి తెలంగాణ సర్కార్ పెరోల్ ఇవ్వడం దారుణమని, ఈ విషయాన్ని తమ పార్టీ ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement