
నా మాటలు రాసి పెట్టుకోండి: ఒవైసీ
తెలంగాణలో తమ జెండా ఎగరేస్తామన్న బీజేపీ నాయకుల ప్రకటనపై మజ్లిస్ పార్టీ జాతీయాధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. తన మాటలు రాసిపెట్టుకోవాలని చెబుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు తాను సవాలు చేస్తున్నానని చెప్పారు.
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తాము బీజేపీని ఓడిస్తామన్నారు. గోషామహల్‌లో బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. అంబర్‌పేట, ఉప్పల్, ముషీరాబాద్, ఖైరతాబాద్.. అన్నిచోట్లా వాళ్లను ఓడించి తీరుతామన్నారు. అక్కడే జెండా ఎగరేయలేనివాళ్లు ఇక తెలంగాణలో జెండా ఎలా ఎగరేస్తారో చూస్తామని ఆయన చెప్పారు.