– పంట అంపశయ్యపై ఉన్న దశలో దేనీకీ హడావుడి
– సీఎం చంద్రబాబుపై వామపక్ష నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్ : వేరుశనగ పంట అంపశయ్యపై ఉన్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఆర్భాటం చేస్తున్నారని వామపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎస్‌యూసీఐ నాయకులు డి.జగదీశ్, వి.రాంభూపాల్, సి.పెద్దన్న, జి.పెద్దన్న, రాఘవేంద్ర మాట్లాడారు. ఎండిన పంటకు రక్షక తడుల పేరుతో ప్రభుత్వ∙వైఫల్యాలను కప్పిపుచ్చుకుని, రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కరు కూడా పంట ఎండిపోతోందనే విషయాన్ని తన దష్టికి తీసుకురాలేదని చంద్రబాబు అనడం చూస్తే రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు.
మెట్టభూముల్లోనే కాకుండా తోటల్లో వేసిన వేరుశనగ పంటకు కూడా ఉడలు దిగలేదన్నారు. దీనిపై అధ్యయనం చేసి కారణాలు తెలుసుకోవాలన్నారు. వేరుశనగ పంట వాడు పట్టినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు కష్ణా పుష్కాల వినోదాల్లో మునిగి తెలుతూ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదన్నారు. అదే సమయంలో జిల్లా అధికార యంత్రాంగం స్వాతంత్య్ర వేడుకల్లో నిమగ్నమై పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వచ్చి పంటను కాపాడేందుకు తాను శ్రమిస్తున్నానని చెప్పుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి జిల్లాలో ముఖ్యమంత్రి మూడు రోజులు జిల్లాలో మకాం వేశారన్నారు. దీనివల్ల రాజకీయ ప్రయోజనాలే తప్ప రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. సమావేశం సీపీఐ సహాయ కార్యదర్శి సి.జాఫర్, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప పాల్గొన్నారు.
ఎందుకింత ఆర్భాటం..?
Published Wed, Aug 31 2016 10:11 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement