జోల పాటే !
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం మంత్రులతో పాటు మిగతా నేతలకూ జోలపాటలా మారింది. వ్యవసాయంపై ఓ వైపు ఆయన లెక్చర్ దంచికొడుతుంటే వారంతా నిద్రమత్తులో జోగారు. మంత్రులు దేవినేని, కాలవతో పాటు ఎమ్మెల్సీలు పయ్యావుల, శమంతకమణి, ఎంపీ జేసీ , ఎమ్మెల్యే ఉన్నం తదితరులు హాయిగా కూర్చీలోనే కునుకు తీశారు. శుక్రవారం రాయదుర్గం మండలం ఉడేగోలంలో నిర్వహించిన ఏరువాక సభలో ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం