ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుంటారు.
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11 గంటలకు పామిడి మండలం నీలూరు– కాలాపురం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటలకు ఫారంపాండ్ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పామిడికి 11.30 గంటలకు చేరుకుంటారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘నీరు– ప్రగతి– ఉద్యమం’ పైలాన్‌ను ప్రారంభిస్తారు.
స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2.30 గంటలకు అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న కేటీఆర్ ఫంక‌్షన్ హాలుకు చేరుకుని.. నీటి వినియోగ సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. సాయంత్రం నాలుగుకు నగర శివారులోని శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి వెళతారు.