సీఎం పర్యటనకు పకడ్బందీ బందోబస్తు | full security of cm tour | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ బందోబస్తు

Published Thu, Apr 20 2017 12:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

full security of cm tour

అనంతపురం సెంట్రల్‌ : ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా çఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు చేపట్టాలని ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. బందోబస్తులో పాల్గొనే అధికారులతో బుధవారం రాత్రి సమీక్షించారు. సీఎం పర్యటన బందోబస్తు కోసం ముగ్గురు అడిషనల్‌ ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 42 మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 1,700 మందిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ఇతర జిల్లా నుంచి కూడా ఫోర్సును రప్పించినట్లు తెలిపారు.  సీఎం పర్యటించే ప్రాంతాలు, రహదారులు, సభా ప్రాంగణం, హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్‌ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement