టీడీపీ కార్యాలయం వద్ద బందోబస్తు | full security of tdp office | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయం వద్ద బందోబస్తు

Published Tue, Apr 4 2017 1:36 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM

full security of tdp office

అనంతపురం టౌన్‌ : మంత్రి వర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో అలజడి రేపుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన వర్గీయులు రాజీనామా బాటలో పయనించిన విషయం తెలిసిందే. ఇక కురుబ సంఘం నాయకులు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను అనంతపురంలో దహనం చేశారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులంతా ఆందోళనకు లోనయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement