కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి.
అనంతపురం అర్బన్: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జాతీయ కార్మిక సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. జిల్లాలోని వామపక్ష పార్టీలకు అనుబంధంగా ఉన్న సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐయుటీయూసీ, తదితర కార్మిక సంఘాలు, వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ సమ్మెకు సమాయత్తమయ్యాయి.
ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత కార్మికులందరూ సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధం అయ్యారు. సమ్మె విజయవంతం చేసే భాగంగా రెండు నెలలుగా నాయకులు విస్తత స్థాయిలో పనిచేస్తూ వచ్చారు. సభలు, కార్మిక సదస్సులు, ర్యాలీలు, ప్రదర్శనలు, కరపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.