కోల్‌కతా ఘటన: వైద్యుల సమ్మెకు మెడికవర్‌ హాస్సిటల్స్‌ మద్దతు | Kolkata Incident: Medicover Hospitals Support IMA Doctors Nationwide Strike | Sakshi
Sakshi News home page

కోల్‌కతా ఘటన: వైద్యుల సమ్మెకు మెడికవర్‌ హాస్సిటల్స్‌ మద్దతు

Published Sat, Aug 17 2024 8:04 PM | Last Updated on Sat, Aug 17 2024 8:20 PM

Kolkata Incident: Medicover Hospitals Support IMA Doctors Nationwide Strike

హైదరాబాద్‌, సాక్షి: కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. ఇండియన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ పిలుపుతో ఒక్కరోజు సమ్మెను పాటించారు. ఈ క్రమంలో సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించింది మెడికవర్ హాస్పిటల్స్. 

ఐఎంఏ సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత , చైర్మన్ డాక్టర్  అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది . యావత్ భారతావని దిగ్భాంతికి లోనైంది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి’’ అన్నారు. 

మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశమంతా  ఇవాళ ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత బాధాకరమైంది . ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కరించాం’’ అని అన్నారు   మెడికవర్‌ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ..‘‘ప్రజల  ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా  జరగడం దారుణాతిదారుణం . ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది , భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి , ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement