
సాక్షి,హైదరాబాద్: కోల్‌కతాలోని ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్‌పై ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాచారం, హత్య జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం(ఆగస్టు12) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు.
‘బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ,స్నేహితులకు నా సానుభూతి. ఇది భరించాల్సిన అంశం కాదు. మరీ ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరిని వదిలిపెట్టకూడదు. ప్రభుత్వం నేరస్థుడిని పట్టుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులకు నా సంఘీభావం. ఆసుపత్రుల్లో వైద్యులు సురక్షితంగా ఉండలేకపోతే, మన ఆడపిల్లలు ఎక్కడైనా సురక్షితంగా ఉంటారా’అని కేటీఆర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment