కమ్యూనిస్టులను విమర్శించడం సరికాదు
హుజూర్‌నగర్ : బీజేపీ, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు కమ్యూనిస్టులను దూషించడం అప్రజాస్వామికమని అఖిలపక్ష నాయకులు అన్నారు.
హుజూర్‌నగర్ : బీజేపీ, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు కమ్యూనిస్టులను దూషించడం అప్రజాస్వామికమని అఖిలపక్ష నాయకులు అన్నారు. గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 27న పట్టణంలో రాస్తారోకో చేపట్టిన బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు కమ్యూనిస్టులను విమర్శించడం తగదన్నారు. పట్టణంలోని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేలా ఇటువంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాలకూరి బాబు, చిలకరాజు అజయ్‌కుమార్, దొడ్డా నర్సింహారావు, అట్లూరి హరిబాబు, కోల శ్రీను, ములకలపల్లి సీతయ్య, శీలం శ్రీను, కంబాల శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, వెంకటరెడ్డి, రామకృష్ణ, జక్కుల మల్లయ్య, వీరయ్య పాల్గొన్నారు.