బీడీ కార్మిక జేఏసీ సమ్మె నోటీసు
Published Wed, Aug 17 2016 1:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
బీడీ కార్మిక జేఏసీ సమ్మె నోటీసు
కాశిబుగ్గ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు సెప్టెంబర్ 2 తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మంగళవారం జిల్లా బీడీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు నగరంలోని బీడీ యజమానులకు సమ్మె నోటీసు అందజేశారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని, నెలకు 28 రోజుల పని కల్పించాలని, వెయ్యి బీడీలకు రూ.250 చెల్లించాలని, కార్మికులందరిపీ ఈఎస్‌ఐ, పీఎఫ్‌తో సంబంధం లేకుండా మూడువేల పింఛన్ ఇవ్వాలని, దరఖాస్తు పెట్టిన 45రోజుల్లో ట్రేడ్ యూనియన్లను రిజిస్ట్రేషన్ చేయాలని, బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే 727 జీఓను రద్దు చేయాలని పేర్కొన్నారు. జేఏసీ ప్రతినిధులు ఖాసిం, కాడబోయిన లింగయ్య, గంగుల దయాకర్, బి.చక్రపాణి, పనాస ప్రసాద్ ఉన్నారు.
Advertisement
Advertisement