మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు
అనంతపురం అర్బన్ :
జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబరు 2న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేసే భాగంలో సన్నాహకంగా శనివారం స్థానిక ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గురువారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె ఉద్దేశాన్ని కార్మికులకు తెలియజేసినా వారిని చైతన్యపర్చడంలో భాగంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
సదస్సుకు ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరికష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ నరసింహరావు, వైఎస్సార్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా హాజరై సార్వత్రిక సమ్మె ప్రాధాన్యం గురించి కార్మికులకు వివరిస్తారని చెప్పారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమోహన్, ఈఎస్ వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, ఐఎఫ్‌టీయూ నాయకులు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.