కార్మికుల హక్కులు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.
విశాఖపట్నం: కార్మికుల హక్కులు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆఫీసు ఎదుట గురువారం పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. కార్మికుల నినాదాలతో కలెక్టరేట్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. పోలీసులు అరెస్టులకు దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
(మహరాణిపేట)