5, 6, 7 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు | AITUC National General Council Meetings Hyderabad | Sakshi
Sakshi News home page

5, 6, 7 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు

Published Fri, Feb 4 2022 3:46 AM | Last Updated on Fri, Feb 4 2022 8:36 AM

AITUC National General Council Meetings Hyderabad - Sakshi

హిమాయత్‌నగర్‌: ఏఐటీయూసీ జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశా లను ఈనెల 5, 6, 7 తేదీల్లో నగరంలో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ బి.వి.విజయ లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలరాజ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. ఎం.డి.యూసుఫ్‌ వెల్లడించారు. గురువారం ఏఐటీయూసీ భవన్‌లో వారు మాట్లాడుతూ.. 3 రోజుల పాటు జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు కాచిగూడలోని మహారాజ క్లాసిక్‌ ఇన్‌ (ఓయో) హోటల్లో జరగనున్నట్టు వారు పేర్కొన్నారు.

5వ తేదీన ఉదయం 10 గంటలకు ఏఐటీయూసీ జాతీయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభ మవుతాయని, 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌ బహిరంగసభ జరుగుతుందన్నారు. సమావేశాలలో ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు రామేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి అమర్‌ జీత్‌ కౌర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌.మహదేవన్‌ తదితరులు పాల్గొంటారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement