హైదరాబాద్: మున్సిపల్ కార్మికులను దేవుళ్లన్న ముఖ్యమంత్రి వారు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి. విజయలక్ష్మి అన్నారు. పర్మినెంట్ చేయాలని కోరుతూ రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు మద్దతుగా మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి, ఏఐటీయూసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నర్సింహ్మా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్మికులకు పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచేవని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్నడి నెలలు గడుస్తున్నా వేతనాలు పెంచకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సమస్యను పరిష్కరించకుండా అణచివేయాలనుకుంటే తిరగబడతామని హెచ్చరించారు.