- టీఆర్‌ఎస్ కార్మిక విభాగంలో చేరిక
ఏఐటీయూసీకి రాజరత్నం గుడ్‌బై
Published Sun, Aug 28 2016 9:01 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
ౖయెటింక్లయిన్‌కాలనీ : ఏఐటీయూసీ యూనియన్‌లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న కందుకూరి రాజరత్నం యూనియన్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాయకుల నియంత పోకడలకు వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందుకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆర్జీ–2 బ్రాంచి కార్యదర్శికి కూడా రాజీనామా చేసినట్లు వివరించారు. బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్న అబ్దుల్‌కరీం కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. వీరు త్వరలో మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో టీఆర్‌ఎస్ కార్మిక విభాగంలో చేరారు.
Advertisement
Advertisement