Published
Mon, Aug 1 2016 8:17 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
రుణ మాఫీ నిధులు విడుదల చేయాలి
చండూరు: రైతులకు రుణ మాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం అంగడిపేట సీపీఐ గ్రామ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణాలు అందక ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారన్నారు. గతంలో నిర్మించుకున్న ఇండ్లు నిర్మించుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో వైద్యాధికారిని నియమించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మందడి నర్సింహా రెడ్డి, మండల కార్యదర్శి నలపరాజు రామలింగయ్య, నలపరాజు సతీష్ కుమార్, జెల్ల శ్రీను, లింగయ్య, పరమేశం, తదితరులు ఉన్నారు.