సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(All India Trade Union Congress) సత్తా చాటింది. మొత్తంగా 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది. సింగరేణి విస్తరించిన ఉన్న 11 ప్రాంతాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులకుగానూ.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. అత్యధిక ఓట్లతో ఏఐటీయూసీతో గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో 5 స్థానాలలో ఐఎన్టీయూసీ, 6 స్థానాలలో ఏఐటీయూసీ విజయం సాధించాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, రామగుండం–2, రామగుండం–3 ప్రాంతాల్లో ఏఐటీయూసీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే కార్మికుల ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
ఇక కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ ఇల్లెందు, మణుగూరు, కార్పొరేట్‌లో ఏఐటీయూసీపై స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్‌ఎస్ అనుబంధ టీజీబీకేఎస్.. ఈసారి ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు.
AITUC సాధించినవి
- బెల్లంపల్లి - 122
- మందమర్రి - 467
- శ్రీరాంపూర్ - 2166
- రామగుండం-1 -451
- రామగుండం-2 - 358
మొత్తం ఓట్లు = 3564 మెజారిటీ
INTUC
- కార్పొరేషన్ - 342
- కొత్తగూడెం - 233
- మణుగూరు - 2
- ఇల్లందు - 46
- భూపాలపల్లి - 801
- రామగుండం-3 - 704
మొత్తం = 2128 మెజారిటీ.
మొత్తంగా
ఏఐటీయూసీ మెజారిటీ =3564
ఐఎన్‌టీయూసీ మెజారిటీ =2129
రాష్ట్ర స్థాయి లో 1436 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది.
పోలింగ్ సరళి ఇలా...!
సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773మందికి 37,447 (94.15శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు బారులుదీరారు. దీంతో గంటగంటకూ పోలింగ్ శాతం పెరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఉదయం 8గంటల వరకు 14.62 శాతం పోలింగ్ నమోదుకాగా, 9గంటలకు 27.05 శాతం , 10గంటలకు 38.67శాతం , 11గంటలకు 49.89శాతం , 12గంటలకు 59.33శాతం , మధ్యాహ్నం 1గంటకు 67.67శాతం 2గంటలకు 75.41శాతం , 3గంటల వరకు 85.92శాతం , 4గంటలకు 93.09 శాతం , పోలింగ్ ముగిసే సాయంత్రం 5గంటల వరకు మొత్తంగా 94.15 పోలింగ్ శాతంగా నమోదైంది. కౌంటింగ్ రాత్రి 7 గంటల నుంచి మొదలైంది. అయితే స్పష్టమైన ఫలితాల కోసం అర్ధరాత్రి దాటే దాకా ఎదురు చూడాల్సి వచ్చింది.
ఎవరు ‘ప్రాతినిధ్యం’... ఎవరు గుర్తింపు సంఘం
సింగరేణివ్యాప్తంగా ఉన్న 11ఏరియాలు ఉండగా, ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్‌ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. పదకొండు ఏరియాల్లోనూ అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్‌ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణిలో ఏడోసారి నిర్వహించిన ఎన్నికల్లో 11 ఏరియాల్లో 4 చోట్ల ఐఎన్‌టీయూసీ 5 చోట్ల గెలిచి ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. మొత్తంగా సింగరేణివ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించి ఏఐటీయూసీ సంఘం గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది.
గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇలా..
1998–ఏఐటీయూసీ
2001–ఏఐటీయూసీ
2003–ఐఎన్‌టీయూసీ
2007–ఏఐటీయూసీ
2012–టీజీబీకేఎస్
2017–టీజీబీకేఎస్
2023–ఏఐటీయూసీ
Comments
Please login to add a commentAdd a comment