labor union
-
బీజేపీ ఎంపీలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం
-
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ జయభేరి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(All India Trade Union Congress) సత్తా చాటింది. మొత్తంగా 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది. సింగరేణి విస్తరించిన ఉన్న 11 ప్రాంతాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులకుగానూ.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. అత్యధిక ఓట్లతో ఏఐటీయూసీతో గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో 5 స్థానాలలో ఐఎన్టీయూసీ, 6 స్థానాలలో ఏఐటీయూసీ విజయం సాధించాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, రామగుండం–2, రామగుండం–3 ప్రాంతాల్లో ఏఐటీయూసీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే కార్మికుల ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఇల్లెందు, మణుగూరు, కార్పొరేట్లో ఏఐటీయూసీపై స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్.. ఈసారి ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు. AITUC సాధించినవి బెల్లంపల్లి - 122 మందమర్రి - 467 శ్రీరాంపూర్ - 2166 రామగుండం-1 -451 రామగుండం-2 - 358 మొత్తం ఓట్లు = 3564 మెజారిటీ INTUC కార్పొరేషన్ - 342 కొత్తగూడెం - 233 మణుగూరు - 2 ఇల్లందు - 46 భూపాలపల్లి - 801 రామగుండం-3 - 704 మొత్తం = 2128 మెజారిటీ. మొత్తంగా ఏఐటీయూసీ మెజారిటీ =3564 ఐఎన్టీయూసీ మెజారిటీ =2129 రాష్ట్ర స్థాయి లో 1436 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది. పోలింగ్ సరళి ఇలా...! సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773మందికి 37,447 (94.15శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు బారులుదీరారు. దీంతో గంటగంటకూ పోలింగ్ శాతం పెరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఉదయం 8గంటల వరకు 14.62 శాతం పోలింగ్ నమోదుకాగా, 9గంటలకు 27.05 శాతం , 10గంటలకు 38.67శాతం , 11గంటలకు 49.89శాతం , 12గంటలకు 59.33శాతం , మధ్యాహ్నం 1గంటకు 67.67శాతం 2గంటలకు 75.41శాతం , 3గంటల వరకు 85.92శాతం , 4గంటలకు 93.09 శాతం , పోలింగ్ ముగిసే సాయంత్రం 5గంటల వరకు మొత్తంగా 94.15 పోలింగ్ శాతంగా నమోదైంది. కౌంటింగ్ రాత్రి 7 గంటల నుంచి మొదలైంది. అయితే స్పష్టమైన ఫలితాల కోసం అర్ధరాత్రి దాటే దాకా ఎదురు చూడాల్సి వచ్చింది. ఎవరు ‘ప్రాతినిధ్యం’... ఎవరు గుర్తింపు సంఘం సింగరేణివ్యాప్తంగా ఉన్న 11ఏరియాలు ఉండగా, ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. పదకొండు ఏరియాల్లోనూ అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణిలో ఏడోసారి నిర్వహించిన ఎన్నికల్లో 11 ఏరియాల్లో 4 చోట్ల ఐఎన్టీయూసీ 5 చోట్ల గెలిచి ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. మొత్తంగా సింగరేణివ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించి ఏఐటీయూసీ సంఘం గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇలా.. 1998–ఏఐటీయూసీ 2001–ఏఐటీయూసీ 2003–ఐఎన్టీయూసీ 2007–ఏఐటీయూసీ 2012–టీజీబీకేఎస్ 2017–టీజీబీకేఎస్ 2023–ఏఐటీయూసీ -
సింగరేణిలో పోరు సైరన్
ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం/కరీంనగర్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. సింగరేణి కార్మిక సంఘాలు, యాజమాన్యం ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ సమావేశమైంది. తీవ్ర ఉత్కంఠల నడుమ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ చీఫ్ లేబర్‌కమిషనర్ (సెంట్రల్) శ్రీనివాసులు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ ఇలా: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 28న నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 30న ప్రకటిస్తారు. అభ్యంతరాల స్వీకరణ, మార్పులుచేర్పుల తర్వాత తుది జాబితా అక్టోబర్ 5న విడుదల చేస్తారు. 6, 7 తేదీల్లో సాయంత్రం 5గంటల వరకు హైదరాబాద్‌లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్‌లో నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలవరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 10న గుర్తులు కేటాయిస్తారు. 28న సింగరేణి సంస్థ విస్తరించిన 11 ఏరియాలు, కార్పొరేట్ లో పోలింగ్ జరుగుతుంది. సింగరేణిలో ప్రస్తుతం 42,390 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాయిదాకు ససేమిరా: హైకోర్టు తీర్పు అనుసరించి గుర్తింపు సంఘం ఎన్నికలపై బుధవారం హై దరాబాద్‌లో జరిగిన సమావేశంలో హైడ్రామా చో టు చేసుకుంది. మొత్తం 16 కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఏఐటీయూసీ, బీఎంఎస్ కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వ హించాలని తమ అభిప్రాయం తెలిపాయి. టీబీజీకేఎస్‌తో పాటు మరికొన్ని సంఘాలు ఎన్నికలు వాయిదా వేయాలన్నాయి. కొందరు కార్మిక సంఘాల ప్రతినిధులు తటస్థంగా ఉన్నా రు. దీంతో కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేసేందుకు యాజమాన్యం తరఫున హాజరైన ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు. వాయిదాపై ఏకాభిప్రాయం వస్తే కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేద్దామంటూ మంతనాలు సాగించారు. అయితే సమావేశం చివరివరకు కూడా ఎన్నికల వాయిదాకు ఏఐటీయూ సీ, బీఎంఎస్‌లు అంగీకరించలేదు. ఎన్నికలు నిర్వహించాల్సిందేన ని పట్టుబట్టాయి. దీంతో కోర్టు తీర్పు ప్రకారం ఎ న్నికల షెడ్యూల్ జారీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగం పూర్తిగా తలమునకలై ఉంది. సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టమే అంటూ ఇదివరకే ఆ జిల్లాల పరిదిలోని అధికారులు చేతులెత్తేశారు. మెజారిటీ సంఘాలు కూడా ఎన్నికల వాయిదాకే పట్టుబట్టాయి. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉంది. 2 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు నిర్వహించే అవకాశం సింగరేణికి లభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 20కిపైగా బొగ్గుగనుల బృందాలు రానున్నాయి. ఇదే కాకుండా అతి కీలకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతోంది. -
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మోర్తాడ్ : రైతులు పండిస్తున్న ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగ సమస్యల పరిశీలనలో భాగంగా ఆయన ఆదివారం మోర్తాడ్‌లో రైతులను కలిసి వారి సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్మూర్ డివిజన్లో రైతులు అధికంగా ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎర్రజొన్నల ఎగుమతి సాగుతుందని వివరించారు. ఈ వాణిజ్య పంటను ప్రభుత్వం బ్రోకర్లకు అప్పగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆర్మూర్ డివిజన్లో 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పంట సాగు అవుతుందని, 7 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి సాగుతుందని తెలిపారు. దళారులు ఈ పంటను కొనుగోలు చేస్తూ రైతులకు సరైన ధర చెల్లించడం లేదన్నారు. గత సంవత్సరం ఎర్రజొన్న పంటను విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు అందాల్సి ఉందన్నారు. అలాగే మొక్కజొన్న పంటకు క్వింటాలుకు రూ.1,410 మద్దతు ధరగా ప్రకటించడం శోచనీయమని తెలిపారు. మక్కలకు మార్కెట్లో ధర అధికంగా ఉండగా, ప్రభుత్వం మద్దతు ధరను పెంచకపోవడం సరికాదన్నారు. రైతు కూలీ సంఘం నాయకులు దేవారాం, భూమయ్య, గంగాధర్, రామకృష్ణ, డాక్టర్ సత్యనారాయణ, సురేశ్, రాజేశ్వర్, కిషన్, భాజన్న, అశోక్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి : ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగ సమస్యలపై పరిశీలన కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఏఐకేఎంఎస్ నేతలు ఆదివారం పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. అనంతరం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రూ. 2 వేలు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేతలు దేవరాం, భూమయ్య, గంగాధర్, రామకృ ష్ణ, సత్యనారాయణ, సురేశ్, రాజేశ్వర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు. -
‘ఆర్టీసీ’ ఎన్నికల్లో టీఎంయూ విజయం
-
‘ఆర్టీసీ’ ఎన్నికల్లో టీఎంయూ విజయం
- ఖమ్మం మినహా అన్ని జిల్లాల్లో ఆధిక్యం - వచ్చే నెల 8న అధికారికంగా ఫలితాల వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూని యన్ (టీఎంయూ) విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌డిపోలు, రీజియన్లు, వర్క్‌షాప్‌లలో మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆ సంఘం ఆధిక్యత చూపింది. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కూటమి ముందంజలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈయూతో కలసి పోటీ చేసి నాటి గుర్తింపు సంఘం ఎన్ఎంయూకు టీఎంయూ చెక్‌పెట్టింది. తెలంగాణ ఏర్పాటయ్యాక తాజాగా జరిగిన తొలి ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకుని రాష్ట్రస్థాయిలో గుర్తింపు కార్మిక సంఘంగా నిలుస్తోంది. అయితే ఈనెల 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికల ఫలితాలు వెల్లడించలేదు. ఆగస్టు 8న అధికారిక ంగా వెలువడే ఫలితాలతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘాలేవో తేలనుంది. 97.7 శాతం పోలింగ్: తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 6 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం వరకు సాగింది. సాయంత్రం 6.30 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పది యూనియన్లు పోటీ పడ్డ ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన యూనియన్ల మధ్య హోరాహోరీగా పోరు సాగుతుందని తొలుత భావించినా... కార్మికులు టీఎంయూ వైపే మొగ్గు చూపారు. మొత్తం 49,600 మంది ఓటర్లు ఉండగా.. 97.7 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 98.2 శాతం, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 96 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్ఎంయూ ఘోర ఓటమిని మూటగట్టుకోగా, ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో కలసి ఈయూ ఖమ్మం జిల్లాలో పరువు దక్కించుకుంది. -
కోలాహలం
♦ ఆర్టీసీలో ఎన్నికల సందడి ♦ సాధారణ ఎన్నికలను తలపిస్తున్న వైనం ♦ మిన్నంటిన ప్రచార హోరు ♦ ఒంటరిగా బరిలోకి టీఎంయూ ♦ జత కలిసిన ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కార్మిక సంఘం గుర్తింపునకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కార్మిక సంఘాలు సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో పోటీచేసింది. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ గెలుపొందిన అనంతరం రెండుగా విడిపోయాయి. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం) ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎంప్లాయీస్ యూనియన్ ఈ సారి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్‌తో కలిసి పోటీ చేస్తోంది. టీఎం యూ ఆవిర్భవించిన ఏడాది కాలంలోనే ఆర్టీసీలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘంగా పేరొందింది. మిత్రపక్షమైన ఎంప్లాయీస్ యూనియన్‌తో విభేదాలు తలెత్తడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి జిల్లా కావడంతో పాటు యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్న మంత్రి హరీశ్‌రావు కూడా జిల్లాకు చెందిన వారే కావడంతో ఈసారి జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీఎం యూ రీజినల్ కన్వీనర్ పీరయ్య, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇప్పటికే డిపోల వారీగా గేటు మీటింగ్‌లు నిర్వహించారు. గతంలో మాదిరిగా జిల్లాలోని 7 డిపోల్లో క్లాస్-6తో పాటు క్లాస్-3లో కూడా టీఎంయూ గెలుపు కోసం కార్మికుల మద్దతు కూడగట్టుకుంటున్నారు. గతేడాదిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వేతన సవరణ కోసం సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే. కార్మికులు ఊహించిన దాని కంటే 42 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం టీఎంయూకు కలిసివచ్చే అవకాశముంది. దాంతో పాటు కొన్నేళ్లుగా నిలిచిపోయిన కారణ్య నియామకాలు, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి రెగ్యులరైజ్ చేయడంతో పాటు పదోన్నతులు కల్పించండం కలిసొచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. టీఎంయూ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈ ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యూఎఫ్‌తో కలిసి పోటీ చేస్తున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అంజాగౌడ్ తెలిపారు. మొత్తంగా ఆర్టీసీలో కురుక్షేత్రాన్ని తలపించేలా కార్మిక సంఘాల నాయకులు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. -
ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికల సందడి
ఎన్నికలపై చర్చించేందుకు 6న ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల కోలాహలం మొదలైంది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలపై చర్చించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ గంగాధర్ జూన్ 6న సమావేశం ఏర్పాటు చేశారు. దానికి హాజరు కావాల్సిందిగా ఆర్టీసీలోని 11 కార్మిక సంఘాలు, ఆర్టీసీ జేఎండీని ఆహ్వానిస్తూ లేఖలు పంపారు. ఈ సమావేశంలో ఎన్నికల తేదీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో అన్ని సంఘాలూ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటైన తర్వాత ఇవే తొలి ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఆరు నెలలు సమ్మెలు నిషేధం... ఆర్టీసీలో మరో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జూన్ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుంది. వేతన సవరణ బకాయిలతోపాటు ఇతర బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఇటీవలే పలు సంఘాల కూటమి సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం పెద్దగా స్పందించనందున సమ్మెకు సై అంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. -
టీఆర్ఎస్కు టీబీజీకేఎస్ అనుసంధానం
- యూనియన్ పగ్గాలు సీఎం కేసీఆర్, గౌరవ అధ్యక్షురాలు కవితకే... - టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం రుద్రంపూర్ (ఖమ్మం): సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా చేస్తూ యూనియన్ ప్రతినిధులు తీర్మానించారు. యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని కేసీవోఏ క్లబ్లో ఆదివారం జరిగింది. సమావేశానికి సింగరేణి వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లోని 11ఏరియాల నుంచి యూనియన్ నాయకులు, ప్రతిని ధులు సుమారు వెయ్యి మంది వరకు హాజరయ్యారు. ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత టీబీజీకేఎస్‌ను టీఆర్ఎస్కు అనుసంధానిస్తూ ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షురాలిగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఎంపికచేస్తూ తీర్మాణం చేయగా కీలక నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత తీసుకుంటారని, వారు తీసుకునే నిర్ణయంపైనే సంఘం నడుస్తుందని తీర్మాణించారు. ప్రస్తు త పదవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎవరిని ఉంచాలన్నా, తీసివేయాలన్నా అది సీఎం కేసీఆర్, గౌర వ అధ్యక్షురాలు కవిత నిర్ణయంపై ఆధారపడి ఉంటుం దని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. సింగరేణి కార్మికుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, తీర్మాణాల రికార్డులను రెండు మూడు రోజుల్లో అధిష్టానానికి పంపనున్నట్లు యూని యన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు ఈ సందర్భంగా ప్రకటించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి మిరియాల రాజి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్, మాజీ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, నాయకులు ఎర్నం గోవర్ధన్, కేంద్ర కార్యదర్శి ఆగయ్య, ఓ.రాజశేఖర్, వై.సారంగపా ణి, టీఆర్ఎస్ నాయకులు జి.వి.కె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల కారణంగానే ప్లాంట్ తరలింపు
ఓసీటీఎల్‌పై కామినేని గ్రూప్ సహేతుక కారణం లేకుండా కార్మికుల సమ్మె పనులను అర్ధాంతరంగా వదిలేస్తున్నారు తరలింపుతో తెలంగాణకురూ. 25 కోట్ల ఆదాయనష్టం 700 ఉద్యోగాలకు కోత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్మిక సంఘం ఒత్తిడికితోడు ఉత్పత్తి కార్యకలాపాలకు కార్మికులు విఘాతం కలిగిస్తున్నందునే ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్) ప్లాంటును తరలించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కామినేని గ్రూప్ చెబుతోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఉన్న ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కష్ణపట్నం సమీపంలో ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. కార్మికులు ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగుతున్నారని కంపెనీ అంటోంది. దీంతో పైపుల నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తయారీ ప్రక్రియకు అంతరాయం కలగకూడదనే ఉద్ధేశంతోనే ప్లాంటును మరోచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఉత్పత్తి పడిపోయి ప్రస్తుతం నెలకు రూ.10 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ప్లాంటు తరలిపోతే తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో సుమారు రూ.25 కోట్ల వార్షికాదాయం కోల్పోతుంది. 700 మంది ఉద్యోగులు రోడ్డున పడతారు. సంఘం ఏర్పాటయ్యాకే.. కంపెనీ మూడేళ్లకోసారి ఒక్కో ఉద్యోగితో వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకుని కనీస వేతనాన్ని పెంచుతోంది. కనీస వేతన చట్టం ప్రకారం కార్మికుడికి 2011లో రూ.6,776, 2014లో రూ.7,959 చెల్లించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కంపెనీ 2011 నుంచి రూ.9,959 చెల్లిస్తూ వస్తోంది. 2014లో వేతన సవరణ ఒప్పందం జరగాల్సి ఉంది. కార్మికులతో వ్యక్తిగతంగా కాకుండా తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని కొన్ని నెలల క్రితం ఏర్పాటైన ఓసీటీఎల్ కార్మిక సంఘం పట్టుబడుతోంది. సంఘాన్ని గుర్తించబోమని కంపెనీ స్పష్టం చేస్తోంది. ఈ అంశమే వివాదాలకు కారణమైంది. కార్మిక సంఘాన్ని గుర్తించే విషయంలో కంపెనీలదే తుది నిర్ణయమని కామినేని గ్రూప్ అంటోంది. పెద్ద ప్రమాదమే జరిగేది.. గత నెలలో కార్మికులు అనూహ్యంగా పనులను వదిలివేశారని, ఇంజనీర్లు అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదమే జరిగేదని కామినేని గ్రూప్ డెరైక్టర్ కామినేని శశిధర్ తెలిపారు. పైపుల నాణ్యతను కార్మికులు పరీక్షించడం లేదన్నారు. ‘చమురు, సహజ వాయువు బావుల్లో 10 కిలోమీటర్ల లోతుకు కూడా ఈ పైపులు వెళ్తాయి. ఏ చిన్న లీకేజీ ఉన్నా డ్రిల్లింగ్ కంపెనీలకు నష్టం వేల కోట్లలో ఉంటుంది. ఓసీటీఎల్ రాక ముందు ఓఎన్జీసీ తదితర దిగ్గజాలు పైపులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా సందర్భాల్లో కంపెనీని మెచ్చుకుందని శశిధర్ వివరించారు. కంపెనీకి ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. రమ్మంటున్న మలేషియా.. ఓఎన్జీసీకి 20 వేల పైపులు ఇంకా సరఫరా చేయాల్సి ఉంది. కొత్త ఆర్డర్లేవీ కంపెనీ తీసుకోవడం లేదు. ఓసీటీఎల్, కామినేని స్టీల్ అండ్ పవర్, యునెటైడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్ కు (యూఎస్‌టీపీఎల్) కలిపి రూ.5,000 కోట్లను గ్రూప్ పెట్టుబడి పెట్టింది. రూ.3,000 కోట్లతో చేపట్టాల్సిన విస్తరణ అటకెక్కింది. ఈ మూడు కంపెనీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మంది పనిచేస్తున్నారు. ఒక్క ఓసీటీఎల్‌లో 700 మంది ఉద్యోగులున్నారు. 80 శాతం మంది స్థానికులే. ఒకానొక సమయంలో ఒక ఏడాది రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. యూఎస్టీపీఎల్లో మలేషియా ప్రభుత్వ సంస్థ యూఎండబ్ల్యుకు 40 శాతం వాటా ఉంది. ఇక్కడ అనిశ్చితి ఉన్న కారణంగా మలేషియాలో ప్లాంటు పెట్టాల్సిందిగా యూఎండబ్ల్యు కోరుతున్నట్లు శశిధర్ చెప్పారు. -
నేటినుంచి కార్మికుల సమ్మె తీవ్రతరం
-
వీధివీధిలో కంపు
ఎక్కడి చెత్త అక్కడే కంపుకొడుతున్న రహదారులు, కాలనీలు నేటినుంచి కార్మికుల సమ్మె తీవ్రతరం ముషీరాబాద్/కవాడిగూడ,న్యూస్‌లైన్: కనీస వేతనం రూ.16,500, మధ్యంతరభృతి ఇవ్వాలని,ఉద్యోగులకు ఆరోగ్య కార్డులివ్వాలన్న తదితర డిమాండ్లతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకపోయింది. గతవారం రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి. గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకపోవడంతో దాన్ని తీసేవారే కరువయ్యారు. కాగా పారిశుద్ద్య కార్మికులు గత వారంరోజులుగా సమ్మె చేస్తుంటే... నేటి నుంచి అదే సమస్యపై మరో పది కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. కాకుంటే కనీస వేతనం ఎంత ఉండాలనే అంశంపై ఈ సంఘాల మధ్య వ్యత్యాసం ఉంది. టీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘం రూ.16,500 కనీస వేతనం ఉండాలంటుంటే..సీఐటీయూ, ఇతర సంఘాలు రూ.12,500 ఉండాలనిడిమాండ్ చేస్తున్నాయి. భారీ ర్యాలీ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా నుంచి వీఎస్టీ వరకూ పారిశుద్ధ్య కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ వేతనాలు పెంచుతామని, డీఏ, మధ్యంతరభృతి, పార్ట్‌టైం స్వీపర్లను పూర్తికాలం కార్మికులుగా గుర్తిస్తామని జీవో విడుదల చేసి ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటినుంచి 10 కార్మిక సంఘాలతో కలిసి సమ్మెను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. 12న మున్సిపల్ కార్మికుల గర్జన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహిస్తామని ప్రకటించారు.