సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
Published Tue, Aug 23 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
తణుకు : కార్మిక చట్టాల పరిరక్షణ, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సోమవారం ఎస్‌ఎస్ మిల్స్ యూనియన్ కార్యాలయంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో కార్మికవర్గంపై ముప్పేట దాడికి పూనుకుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కార్మిక హక్కులను కాలరాస్తూ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాలు నిర్వహిస్తే ఉద్యోగాల నుంచి నిర్లక్ష్యంగా తొలగిస్తూ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరగనున్న సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ ఉపాధ్యక్షులు దుడే రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి పరిమి వెంకటేశ్వరరావు, ఉపా««దl్యక్షులు నెక్కంటి రాజకుమార్ పాల్గొన్నారు.
Advertisement