september 2
-
ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన
సాక్షి, నెల్లూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. ఆదిత్య ఎల్-1పై ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఇక, ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై అధ్యయనం చేయనున్న విషయం తెలిసిందే. సూర్యుడి కరోనాపై పరిశోధనలు.. చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో మరన్ని ప్రయోగాలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది. ఇందు కోసం ఆదిత్య ఎల్-1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఇవి ఉపయోగపడనున్నాయి. ఇక, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి. ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
బహు భేషైన బ్రెడ్
పిల్ల ఏడ్చింది! అయితే బ్రెడ్ ముక్కలు పెట్టమంటున్నారు ఇప్పటి ఆధునిక బామ్మలు. ఎందుకంటే చపాతీ ముద్ద కలిపి, పూరీలు, పుల్కాలు చేసి.. నూనె వేసి, కాల్చి ఇచ్చే తీరిక, ఓపికా రెండు కరువైపోయాయి. అందుకే, కాస్త జామ్ పూసి, ఆమ్లెట్ వేసి ఇన్స్టంట్ బ్రెడ్లనే పిల్లలకు అందించేస్తున్నారు మోడ్రన్ అమ్మలు. ఏ బ్రెడ్ అయితేనేం గోధుమ రెసిపీ అయితే అన్ని విధాలా ఆరోగ్యకరమే! ఇంతకీ విషయమేంటంటే త్వరలో ‘బ్రెడ్ డే’ రాబోతుంది. దాని విశేషాలు ఓ సారి చూద్దాం!! బుల్లి చపాతి!! ‘అమ్మా.. నాకు బుల్లి ఉండ ఈయమ్మా.. నేను కూడా చపాతీ చేసుకుంటా..’ అని ముద్దుముద్దుగా అడిగే బుల్లి బుజ్జాయిలను చూస్తే బాల్యం భలే గుర్తొస్తుంది. చిన్నప్పుడు బుల్లి చపాతి, బుల్లి పూరి లాగించిన జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతుంటాయి. హాలీడే వచ్చిందంటే చపాతీ, పూరీలకు ప్రత్యేకమైన రోజు. బంగాళాదుంప కుర్మాలో చపాతీని అలా తుంచి.. ఇలా నోట్లో పెట్టుకుంటే....! అబ్బా, నోరు ఊరుతుంది కదూ.. వెంటనే తినాలనిపిస్తుంది కదూ! మనం అప్పుడప్పుడు అరుదుగా చేసుకునే చపాతీలు, పుల్కాలను నార్త్ ఇండియన్స్ రెగ్యులర్‌గా లాగిస్తుంటారు. మనం చేసుకునే ఈ చపాతీలనే ఫారినర్స్ ఫ్లాట్ బ్రెడ్స్ అంటారు. బ్రెడ్ కథలు కొన్ని ఏళ్ల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా బ్రిటన్‌లో బ్రెడ్ గేమ్ జరిగేది. బ్రెడ్‌లో సిల్వర్ కాయిన్ పెట్టి ఆడే ఈ ఆటలో ధనికులే అధికంగా పాల్గొనేవారట. ఈ రోజుల్లో బ్రెడ్ అన్ని తరుగతుల వారు వాడుతున్నారు. అయితే మధ్యయుగంలో పాశ్చాత్య ఐరోపా వారు బ్రెడ్‌ను తరగతుల వారీగా తయారు చేసుకునేవారట. వాటికి పోప్స్ లోఫ్(బ్రెడ్), కోర్ట్స్ లోఫ్, కామన్ లోఫ్ అనే రకరకాల పేర్లు ఉండేవి. బెటర్ బ్రెడ్ ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ – బి వంటి పోషకాలెన్నో బ్రెడ్‌లో ఉంటాయి. బ్రిటన్ పురుషులు రోజుకి 113 గ్రాముల బ్రెడ్ తింటుంటే.. అక్కడి మహిళలు 76 గ్రాములు లాగించేస్తున్నారు. 2007 నుంచి సగటు ఆహారం, ఇతర పానీయాల ధర 33 శాతం పెరగగా... బ్రెడ్ ధర 34 శాతం పెరిగింది. బ్రెడ్ నమ్మకాలు ఏదేమైనా ఆచారాలు, నమ్మకాల విషయంలో మనుషులంతా ఒక్కటేనేమో అనిపిస్తుంది. స్కాండినేవియన్ సంప్రదాయంలో.. అమ్మాయి, అబ్బాయి ఒకే బ్రెడ్ తింటే వాళ్లు ప్రేమలో ఉన్నట్లు అర్థమట. ఇక బ్రెడ్ అనేది ఈజిప్టు ప్రజలకు గౌరవప్రదమైంది. ఒకప్పుడు దాన్ని కరెన్సీగా కూడా ఉపయోగించేవారు. మరణించిన శవాలతో పాటు... బ్రెడ్ కూడా సమాధుల్లో పెట్టడం వారి ఆచారం. మరోవైపు మధ్యయుగంలో ఫ్రాన్స్‌లోని వడ్డీ వ్యాపారులు బ్రెడ్‌ను అప్పులుగా ఇచ్చేవారట. ఇక కొన్ని చోట్ల టోస్ట్ చేసేటప్పుడు బ్రెడ్ బోర్లపడితే అశుభమనే మూఢ నమ్మకం కూడా ఉంది. గోధుమ లెక్కలు ఒక మనిషి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్గా మొత్తం గోధుమ ఆహారాన్నే తీసుకున్నట్లయితే... 168 రోజులకు సుమారు 60 కేజీల గోధుమలు ఖర్చు అవుతాయి. అంటే... ఒక ఎకరంలో పండే గోధుమలతో నలుగురు సభ్యులు సంవత్సరం పాటు జీవించొచ్చు. చరిత్రలో బ్రెడ్బ్రెడ్ తయారీ అనేది క్రీస్తు పూర్వం 2,500 ఏళ్ల క్రితమే ఉంది. అప్పట్లోనే 80 రకాల బ్రెడ్ తయారు చేసుకునేవారు. ఈ విశేషాలన్నీ పక్కనపెడితే... ‘బ్రెడ్ డే’ రోజున గోధుమ ఐటమ్స్ చేసుకుని ఇంటిళ్లిపాది తింటే బహు బాగుంటుంది కదూ! మరి ఈ సారికి అలా కానిచ్చేయ్యండి!! -
సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు
సాక్షి, సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న వాడవాడలా సేవా కార్యక్రమాలు, సభలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈమేరకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17 మంది సీఎంలు మారినా ప్రజల హృదయాల్లో ఒక్క వైఎస్సార్ మాత్రమే గూడుకట్టుకొని ఉండి పోయారన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు వైఎస్సార్ ఎనలేని సేవ చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, 108, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆరోగ్య శ్రీ, పక్కాఇళ్లు లాంటి ప్రజా ప్రయోజనాలు కల్పించే పథకాలతో అవసరం వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చేది వైఎస్సార్ అని చెప్పారు. అటువంటి సంక్షేమ పథకాల ప్రదాత పేరు సెప్టెంబర్ 2న వాడవాడలా అందరి హృదయాల్లో మార్మోగేలా...విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి వేల్పుల విజయ ప్రసాద్, యాదయ్య, సేవాదళ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
తణుకు : కార్మిక చట్టాల పరిరక్షణ, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సోమవారం ఎస్ఎస్ మిల్స్ యూనియన్ కార్యాలయంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో కార్మికవర్గంపై ముప్పేట దాడికి పూనుకుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కార్మిక హక్కులను కాలరాస్తూ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాలు నిర్వహిస్తే ఉద్యోగాల నుంచి నిర్లక్ష్యంగా తొలగిస్తూ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరగనున్న సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ ఉపాధ్యక్షులు దుడే రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి పరిమి వెంకటేశ్వరరావు, ఉపా««దl్యక్షులు నెక్కంటి రాజకుమార్ పాల్గొన్నారు. -
సమ్మెను విజయవంతం చేయాలి
శ్రమ దోపిడీకి పాల్పడుతున్నప్రభుత్వాలు కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేయాలి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి హన్మకొండ : కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ పరిస్థితులు, ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై కార్మిక సంఘాలన్నీ పోరాడేందుకు ఏకమయ్యాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 6వ పే కమిషన్ 54 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం వేసిన 7వ పే కమిషన్ కేవలం 23.5 శాతం మాత్రమే ఇచ్చిందని, ఫిట్మెంట్ పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.16వేలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలన్నా రు. సింగరేణ సంస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలి యా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతి కావడంతో లోకల్ బొగ్గుకు గిరాకి తగ్గి నిలువలు పెరిగిపోతున్నాయని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిం చాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంస్థలే నేరుగా జీతాలు ఇవ్వాలని, ఈ నెలాఖరు వరకు ఇవ్వక పోతే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఐఎన్టీయూసీ జాతీయ ముఖ్య ఉపాధ్యక్షులు జనక్‌ప్రసాద్, ఇనుగాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్, నాయకులు పి.మహేందర్‌రెడ్డి, హనుమంతరావు, త్యాగరాజు, లక్ష్మణ్, సదయ్య పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె
విజయవాడ(గాంధీనగర్) : కార్మికుల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు , సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ సమ్మెకు సన్నద్ధంలో భాగంగా ఈనెల 16న అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా, పట్టణాల స్థాయిలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు అన్ని పట్టణాలలో ఫ్యాక్టరీ గేట్ల వద్ద సభలు, పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహించాలని, ఈనెల 31న సమ్మెపై ప్రచారం చేస్తూ బైక్ ర్యాలీలు అన్ని పట్టణాల్లో నిర్వహించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 2న పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బి.వెంకటసుబ్బయ్య(ఐఎన్టీయూసీ), పి.పోలారి (ఇఫ్టూ), పి.రామ్‌దేవ్, చలసాని వెంకటరామారావు (ఏఐటీయూసీ), బరబన నాగేశ్వరరావు, ఆసుల రంగనాయకులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలి
కార్మిక సంఘాల నాయకులు పిలుపు ఒంగోలు టౌన్ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గం సన్నద్ధం కావాలని జిల్లాకు చెందిన కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాన్ని 18 వేల రూపాయలకు తగ్గకుండా నిర్ణయించాలని, నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. మరోవైపు ఉద్యోగులు, కార్మికుల హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారన్నారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వాలకు హెచ్చరిక పంపాలని, అందుకోసం జిల్లాలోని ఉద్యోగ, కార్మికవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మజుందార్, చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి బి.వెంకట్రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఆర్.మోహన్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రామస్వామి, కె.వీరాస్వామిరెడ్డి, జిల్లా నాయకులు చంద్రశేఖర్, జనార్దన్, వాసు, రఫీ పాల్గొన్నారు. -
ప్రజల గుండెల్లో వైఎస్
సంగారెడ్డి క్రైం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు మెతుకు సీమ లో ఎందరో నిరుపేదలు, అభాగ్యులకు అండ గా నిలిచాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ, ఉచిత కరెంట్, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, బంగారుతల్లి, సామాజిక పెన్ష న్లు, ఆరోగ్యశ్రీ వంటి లెక్కకు మించి ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిర్విరామంగా కొనసాగించిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. మనసున్న నేతగా అన్ని వర్గాల ప్రజల్లో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంద ని తెలిపారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న జిల్లా వ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అన్నదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ హయాంలో అమలైన అన్ని సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహానేత పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని రుణ మాఫీ, ఉచిత కరెంట్, రుణాల రీ షెడ్యూల్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశారని కొనియాడారు. వైఎస్ చేసిన కృషి వల్లే జిల్లాకు సింగూరు సాగు జలాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్, వైద్యనాథ్, అంతయ్య, పరశురాం, పాండు తదితరులు ఉన్నారు. -
నేడు నెల్లూరు జిల్లాలో షర్మిళ పాదయాత్ర
-
రేపటి నుంచి షర్మిళ సమైక్య శంఖారావం బస్సుయాత్ర
-
తిరుపతి నుంచి షర్మిళ బస్సు యాత్ర
-
సెప్టెంబరు 2నుంచి షర్మిల బస్ యాత్ర
-
సెప్టెంబరు 2నుంచి షర్మిల బస్సు యాత్ర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబరు 2 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ రోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమె ఈ యాత్ర చేయనున్నారు. సీమాంధ్ర జిల్లాలలో ఆమె బస్సు యాత్ర చేస్తారు. షర్మిల 230 రోజులపాటు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. పాదయాత్ర కూడా అమె ఇడుపులపాయ నుంచే ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించారు. పాదయాత్రలో ఆమె అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా బస్సుయాత్ర చేయనున్నారు. సమన్యాయం చేయలేకపోతే, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కూడా ఆమె కోరుతున్నారు.