సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు
Published Mon, Aug 29 2016 10:03 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
సాక్షి, సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న వాడవాడలా సేవా కార్యక్రమాలు, సభలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈమేరకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బెంబడి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 17 మంది సీఎంలు మారినా ప్రజల హృదయాల్లో ఒక్క వైఎస్సార్ మాత్రమే గూడుకట్టుకొని ఉండి పోయారన్నారు. కులాలు, మతాలు, పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు వైఎస్సార్ ఎనలేని సేవ చేశారన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, 108, పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఆరోగ్య శ్రీ, పక్కాఇళ్లు లాంటి ప్రజా ప్రయోజనాలు కల్పించే పథకాలతో అవసరం వచ్చినప్పుడు మొదట గుర్తుకు వచ్చేది వైఎస్సార్ అని చెప్పారు. అటువంటి సంక్షేమ పథకాల ప్రదాత పేరు సెప్టెంబర్ 2న వాడవాడలా అందరి హృదయాల్లో మార్మోగేలా...విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి వేల్పుల విజయ ప్రసాద్, యాదయ్య, సేవాదళ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement