minimum salary
-
బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్లో ఆసక్తికర చర్చ
ప్రపంచవ్యాప్తంగా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) వేదికగా నిలుస్తోంది. చిన్నపాటి సమస్యలను ఇంటర్నెట్లో చర్చకు పెట్టి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నెటిజెన్లు. ట్విటర్లో బాగా చర్చ జరుగుతున్న ఓ పోస్ట్ గురించి మీకు తెలియజేస్తున్నాం. ఇషాన్ శర్మ అనే క్రియేటర్, కోడర్.. బెంగళూరులో జీవించడానికి అవసరమైన కనీస జీతం గురించి ట్విటర్లో యూజర్లను అడిగారు. ఈ పోస్ట్‌కి కొన్ని యూజర్ల నుంచి ఆసక్తికరమైన రిప్లయిలు వచ్చాయి. (బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: మహిళలకు షాకింగ్ ప్రశ్నల దుమారం) ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు 2023లో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా పీజీలో ఉండే ఫ్రెషర్‌కు రూ.30,000, ఫ్లాట్‌లో ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాచిలర్లకు రూ. 50,000, పెళ్లయిన వారికి రూ. 75,000, టూబీహెచ్‌కే ఫ్లాట్‌లో పిల్లలతో ఉండేవారికి రూ. 1,00,000 ప్రతి నెలా చేతిలో ఉండాలని ఓ యూజర్ రాసుకొచ్చారు. అక్కడ ఎంత సంపాదించినా తక్కువే అని మరో యూజర్ రిప్లయి ఇచ్చారు. అలాగే మరికొందరు తమకు తోచిన విధంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఒక మహిళ చేసిన ట్వీట్ కూడా చర్చకు దారితీసింది. మెట్రో నగరంలో జీవించడానికి ఫ్రెషర్‌కు నెలకు రూ. 50,000 కూడా సరిపోదని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు What is the bare minimum salary a fresher needs to survive and work in Bengaluru?👀 — Ishan Sharma (@Ishansharma7390) June 29, 2023 Following should be the "ideal" cash in hand for 2023 cost of living (considering no liabilities) : fresher in a PG (22): 30,000 experienced bachelor in a flat (26): 50,000 married working couples (30): 75,000 married with a child in a 2BHK (34): 1,00,000 — Finance💰 Films 🎬 Tech 📱 (@souvikdas17) June 29, 2023 -
పేరుకు బడిపంతులు చేతల్లో బానిస
దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వేల పాఠశాలలు, కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు. అందులో ఎవరు చదువు చెబుతున్నారు. వారి అర్హతలు ఏమిటి, వారికి ఇస్తున్న వేతనాలు ఏమిటి, వారి జీవన ప్రమాణాలు ఏమిటని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం విషాదకరం. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ముగిసిం దంటే చాలు ఉన్న ఉపాధ్యాయులు వచ్చే సంవత్సరం కొనసాగుతారో లేదో తెలియని దుస్థితి. కొత్త విద్యాసంవత్సరం ఉద్యోగంలో కొనసాగాలంటే విధిగా 50 మంది విద్యార్థులను తాను పని చేస్తున్న పాఠశాలల్లో అడ్మిషన్లు చేయించాలి. అలా చేయకపోతే ఉద్యోగం ఊడినట్లే లెక్క. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరమైన పరిస్ధితుల్లో ఉన్నాయి. విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి 12 నెలల ఫీజులు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. కానీ అక్కడే పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలలే వేతనాలు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో వేలాది పాఠశాలలు, వందలాది ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో లక్షలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర పనిలో ఉన్నారు. వీరిని సరుకుగా మార్చి వేల కోట్లు లాభాలు చేకూర్చే వ్యాపారంగా మార్చారు. భావి భవిష్యత్ నిర్మాతలను తయారు చేసే గురువులకు కడుపులు పస్తు పెడితే ఏ అలోచనతో వారు విద్యార్థులకు చదువు చెబుతారో కూడా అర్ధం చేసుకోని స్థాయికి వ్యవస్థ దిగజారింది.ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది బోధన, భోధనేతర సిబ్బందిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరిలో 70 శాతానికి పైగా ఈఎస్ఐ, పీఎఫ్ విధానం అమలు కావటం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు హెల్త్ కార్డులను ఇవ్వాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. – ఎస్. నూర్‌మహమ్మద్ మొబైల్ : 94900 98057 -
కనీస వేతనం ఇక రూ 21,000..?
న్యూఢిల్లీః ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. కనీస వేతనం ప్రస్తుతం ఉన్న రూ 18 వేల నుంచి రూ 21 వేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతన పెంపు ఉంటుందని భావిస్తున్నారు. కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని రూ 25వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తుండగా రూ 21 వేలకు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మరోవైపు పండుగ సీజన్‌ను పురస్కరించుకుని సెప్టెంబర్ 26 నుంచి ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేందుకు ఒడిషాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అంగీకరించింది. -
కదం తొక్కిన ఆశ కార్యకర్తలు
► చలో జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఉద్రిక్తం ► కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ ► 21 మంది కార్యకర్తల అరెస్టు శ్రీకాకుళం పాతబస్టాండ్: తమకు రూ. 6వేలు కనీస వేతనం చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు బుధవారం చేపట్టిన ‘చలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం’ ఉద్రిక్తంగా మారింది. ముందుగా ఆశ కార్యకర్తలు పట్టణంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానం నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను వైద్య ఆరోగ్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా రెండో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేట్లను మూసివేయడంతో కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వచ్చి వినతి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశ కార్యకర్తలు ఆందోళన విరమించాలని రెండో పట్టణ సీఐ దాడి మోహనరావు, ఎస్ఐ రవికుమార్ కోరారు. కానీ ఎంతకీ విరమించకపోవడంతో పోలీసులు 21 మంది కార్యకర్తలను అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆశ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిపాలనాధికారి డాక్టర్ దవల భాస్కరరావు వచ్చి వినతి పత్రాన్ని అందుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళతామని హమీ ఇచ్చారు. అరెస్టులు చేసిన కార్యకర్తలను పోలీసులు విడుదల చేశారు. కాగా అరెస్టు చేయడంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, మహిళలను ఇబ్బందులు పెట్టారని కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి దుర్మార్గం ర్యాలీకి ముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. మహిళా సంక్షేమం పేరు చెబుతూ, మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ఆశ కార్యకర్తలకు తెలంగాణాలో నెలకు రూ. 6 వేలు వేతనం చెల్లిస్తున్నారని, ఆదే విధంగా ఏపీలోనూ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 3న పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలెక్టరేట్‌ను దిగ్భందిస్తామని వెల్లడించారు. ఆశ కార్యకర్తల శ్రమకు కనీస వేతం కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. వారి సమస్యలు పరిష్కారమయ్యేవరకూ ఉద్యమాలు చేయడానికి సిద్ధమని గోవిందరావు తెలిపారు. ఆశ కార్యకర్తల సంఘం నాయకులు ఎన్. హిమప్రభ, కె.నాగమణి, ఎ సత్యం మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలకు అలవెన్సులివ్వాలని, పని భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.లతాకాంతి, ఎ.మహలక్ష్మి, కె.ఆదిలక్ష్మి, బి.స్వప్న, రామూర్తి, అమ్మన్నాయుడు, కె.ధనలక్ష్మి పాల్గొన్నారు. -
వేతన సలహా మండలి సభ్యునిగా ‘కుసుమ’
అమలాపురం టౌ¯ŒS : స అమలాపురానికి చెందిన తెలుగునాడు ట్రేడ్ యూనియ¯ŒS కౌన్సిల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కుసుమ సూర్య మోహనరావు రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ టీఎ¯ŒSటీయూసీ నేతగా కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేసిన తాను ఇక నుంచి కార్మికులకు కనీస వేతనాల అందేలా కృషి చేస్తానని సూర్యమోహనరావు స్థానిక విలేకర్లకు తెలిపారు. తనకు ఈ పదవి వచ్చేందుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ డాక్టర్ పి.రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఎ.ఆనందరావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పదవి రావటంపై ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు, టీఎ¯ŒSటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గళ్లా రాము అభినందించారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
తణుకు : కార్మిక చట్టాల పరిరక్షణ, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 2న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సోమవారం ఎస్ఎస్ మిల్స్ యూనియన్ కార్యాలయంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో కార్మికవర్గంపై ముప్పేట దాడికి పూనుకుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కార్మిక హక్కులను కాలరాస్తూ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నాలు నిర్వహిస్తే ఉద్యోగాల నుంచి నిర్లక్ష్యంగా తొలగిస్తూ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరగనున్న సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరారు. యూనియన్ ఉపాధ్యక్షులు దుడే రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి పరిమి వెంకటేశ్వరరావు, ఉపా««దl్యక్షులు నెక్కంటి రాజకుమార్ పాల్గొన్నారు. -
కనీస వేతనాలతోనే కార్మికుల మనుగడ
ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి బీజేపీ, టీడీపీలపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ధ్వజం తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాజమహేంద్రవరం సిటీ : కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవనం ఇబ్బందికరంగా తయారైందని వారికి కనీస వేతనాలు అందించేందుకు మోడీ ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన అన్నరు. ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీలో ఐఎన్టీయూసీ జిల్లా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కలసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ విదేశీ వ్యాపారులను మోడీ దేశంలోనికి ఆహ్వానించడం ద్వారా కార్మికులను మరింత పేదవాళ్లను చేస్తున్నారన్నారు. బీజేపీ ధనవంతులు, వ్యాపారులకు అండగా మారిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల కోసం అన్ని కార్మిక సంఘాలతో కలసి సెప్టెంబరు 2న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు సంజీవరెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ .రఘువీరారెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కార్మికులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని, ఆ మేరకు నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. వీరి పాలనలో పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. మాజీ మంత్రి పల్లం రాజు, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, సుంకర పద్మశ్రీ, పంతం నానాజీ, తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబే అసలైన ద్రోహి : రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబే అసలైన ద్రోహి అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఐఎన్టీయూసీ జిల్లా కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారన్నారు. ప్రత్యేక హోదావిషయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా సంజీవిని కాదని ఆయన నైజం బైటపెట్టుకున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధనకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రత్యేక బిల్లుకు మద్దతు ఇచ్చి హోదాకు అనుకూలంగా ఓటు వేయాలని రఘువీరారెడ్డి కోరారు.