ప్రపంచవ్యాప్తంగా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) వేదికగా నిలుస్తోంది. చిన్నపాటి సమస్యలను ఇంటర్నెట్‌లో చర్చకు పెట్టి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నెటిజెన్‌లు.
ట్విటర్‌లో బాగా చర్చ జరుగుతున్న ఓ పోస్ట్ గురించి మీకు తెలియజేస్తున్నాం. ఇషాన్ శర్మ అనే క్రియేటర్, కోడర్.. బెంగళూరులో జీవించడానికి అవసరమైన కనీస జీతం గురించి ట్విటర్‌లో యూజర్లను అడిగారు. ఈ పోస్ట్‌కి కొన్ని యూజర్ల నుంచి ఆసక్తికరమైన రిప్లయిలు వచ్చాయి. (బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: మహిళలకు షాకింగ్ ప్రశ్నల దుమారం)
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు
2023లో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా పీజీలో ఉండే ఫ్రెషర్‌కు రూ.30,000, ఫ్లాట్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ ఉన్న బ్యాచిలర్లకు రూ. 50,000, పెళ్లయిన వారికి రూ. 75,000, టూబీహెచ్‌కే ఫ్లాట్‌లో పిల్లలతో ఉండేవారికి రూ. 1,00,000 ప్రతి నెలా చేతిలో ఉండాలని ఓ యూజర్ రాసుకొచ్చారు.
అక్కడ ఎంత సంపాదించినా తక్కువే అని మరో యూజర్ రిప్లయి ఇచ్చారు. అలాగే మరికొందరు తమకు తోచిన విధంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఒక మహిళ చేసిన ట్వీట్ కూడా చర్చకు దారితీసింది. మెట్రో నగరంలో జీవించడానికి ఫ్రెషర్‌కు నెలకు రూ. 50,000 కూడా సరిపోదని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు
What is the bare minimum salary a fresher needs to survive and work in Bengaluru?👀
— Ishan Sharma (@Ishansharma7390) June 29, 2023
Following should be the "ideal" cash in hand for 2023 cost of living (considering no liabilities) :
— Finance💰 Films 🎬 Tech 📱 (@souvikdas17) June 29, 2023
fresher in a PG (22): 30,000
experienced bachelor in a flat (26): 50,000
married working couples (30): 75,000
married with a child in a 2BHK (34): 1,00,000
Comments
Please login to add a commentAdd a comment