బెంగళూరు: పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళతో ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తించారు. వరకట్నం కేసుకు సంబంధించి సాక్షిగా వచ్చిన మహిళను వేధించినంట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది. వరకట్నం విషయంపై సాక్షిగా సుద్ధగుంటపాళ్య పోలీసు స్టేషన్‌కు పిలుపించుకున్న ఎస్‌ఐ మంజునాథ్‌స్వామి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళలు ట్విట్టర్‌లో బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు.
స్నేహితురాలి విడాకుల కేసులో సాక్షిగా వివరాలను ఇవ్వటానికి స్టేషన్‌కు వెళ్లాను. ఎస్‌ఐ మంజునాథస్వామి మొదట చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. అనంతరం అతడి నిజస్వరూపం బయట పడింది. విచారణ సమయంలో తన చేతులు పట్టుకుని ముద్దు పెట్టడానికి యత్నించాడు’. అని బాధితురాలు ఆరోపించారు. స్టేషన్‌లో కుర్చోన్న తన నడుం గిల్లి, క్యాబిన్ పక్కన ఉన్న రూంకు రావాలని పిలిచాడని, అదే సమయంలో మా అమ్మ ఫోన్ చేయటంతో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లటంతో అతడి నుంచి తప్పించుకున్నట్లు వివరించారు.
స్టేషన్‌లోనే కాకుండా ఇంటికి వచ్చిన తరువాత వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పెట్టి మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు ఎస్‌ఐపై ఆరోపణలు చేశారు. ఇంటికి వెళ్లాక వాట్సాప్‌లో తన ఫోటోలు పంపాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు సాక్షులను తీసుకోవటం సరి అయితే తన ఫోటోలను పంపాలని సూచించటం ఎంత వరకు న్యాయమని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తను స్టేషన్‌లో ఉన్నంత వరకు ఏమి మాట్లాడలేక భయంతో ఉన్నట్లు వివరించారు. ఎస్‌ఐ ఘటనకు సంబంధించి బాధితురాలు ఫఙర్యాదు చేసిందని డీసీపీ సీకే బాబా తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment