కనీస వేతనం ఇక రూ 21,000..?
కనీస వేతనం ఇక రూ 21,000..?
Published Tue, Sep 5 2017 7:04 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM
న్యూఢిల్లీః ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది. కనీస వేతనం ప్రస్తుతం ఉన్న రూ 18 వేల నుంచి రూ 21 వేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతన పెంపు ఉంటుందని భావిస్తున్నారు.
కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని రూ 25వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తుండగా రూ 21 వేలకు పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. మరోవైపు పండుగ సీజన్‌ను పురస్కరించుకుని సెప్టెంబర్ 26 నుంచి ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేందుకు ఒడిషాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అంగీకరించింది.
Advertisement