వేతన సలహా మండలి సభ్యునిగా ‘కుసుమ’
Published Mon, Oct 24 2016 7:06 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
అమలాపురం టౌ¯ŒS : స
అమలాపురానికి చెందిన తెలుగునాడు ట్రేడ్ యూనియ¯ŒS కౌన్సిల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కుసుమ సూర్య మోహనరావు రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ టీఎ¯ŒSటీయూసీ నేతగా కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేసిన తాను ఇక నుంచి కార్మికులకు కనీస వేతనాల అందేలా కృషి చేస్తానని సూర్యమోహనరావు స్థానిక విలేకర్లకు తెలిపారు. తనకు ఈ పదవి వచ్చేందుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ డాక్టర్ పి.రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఎ.ఆనందరావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పదవి రావటంపై ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు, టీఎ¯ŒSటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గళ్లా రాము అభినందించారు.
Advertisement
Advertisement