పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
Published Tue, Jul 26 2016 1:07 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ టౌన్ : పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.నరసింహన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2012లోనే వర్తింపజేయాల్సిన పే రివిజన్ నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. పింఛన్ సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదవ కేటగిరీలోని ఖాళీలను యాబై శాతం పీఏసీఎస్ ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు. అనంతరం సీఈఈ మదన్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, బి.అనంతరెడ్డి, జె.శ్యాంసుందర్‌రెడ్డి, వి.వెంకట్‌రెడ్డి, అంజనేయులు, రామస్వామి, గణేష్, జనార్ధన్‌రెడ్డి, కె.అనంతరెడ్డి, బిక్షమయ్య, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, వాసు, ఉపేందర్, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఎస్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement