కాకినాడ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షనర్ల ప్యారడైజ్ అని. రాష్ట్రంలో ఎక్కడ రిటైరయినా.. కాకినాడకు వచ్చి సెటిల్ కావాలని కలలు కనే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ప్రశాంత వాతావరణం, అందమైన నగరం, సముద్రం నుంచి వచ్చే వెచ్చటి గాలులు.. వెరసి కాకినాడకు విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. ఇప్పుడు కాకినాడ గురించి ఈ చర్చ అంతా ఎందుకంటే.. ఈ నగరంపై పవన్ కన్నుపడింది.
కాకినాడలో పవన్ క్యాంపు
పవన్ కళ్యాణ్.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థంకాక తెగ సతమతమవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలను పరిశీలించినప్పటికీ కాస్త బెటర్ ఆప్షన్‌ను ఎంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కాకినాడపై పవన్ దృష్టి పడింది. అసలు కాకినాడలో తనకు అనుకూలమేంటీ? ప్రతికూలమేంటీ? అన్న సమీకరణాలతో కాకినాడపై దృష్టి సారించారు పవన్‌కళ్యాణ్.
మకాం కోసం ఇల్లు కావలెను
కాకినాడలో సొంత ఇంటి కోసం సన్నాహాలు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. తన నివాసం కోసం అనువైన ప్రాంతాల పరిశీలన చేస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడి ఓ విశాలమైన ఇల్లు కావాలని, ఎన్నికల వరకు ఉండేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నారు. మీటింగ్‌లతో పాటు, కార్యకర్తలను కలిసేందుకు వీలుండేలా ఓ భారీ భవంతి మంచి సెంటర్‌లో తీసుకోవాలన్న యోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది.
పోటీ చేస్తే.. ఫలితమెలా ఉండవచ్చు?
మరొకవైపు వార్డుల వారీగా సామాజిక వర్గాలతో భేటీలకు కూడా శ్రీకారం చుట్టారు పవన్. ఇప్పటికే కాకినాడ 28 వార్డు పెద్దలతో మంతనాలు జరిపిన పవన్.. మరో రెండు మూడు రోజుల్లో అక్కడే పర్యటించనున్నారు. కాకినాడ నుంచే పోటీ చేస్తే.. గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై మంతనాలు చేస్తున్నారు. కులాల వారీగా సమీకరణాలెలా ఉన్నాయి? ఏ వర్గం జనసేనను గుర్తిస్తుంది? ఎవరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు అవకాశాలుంటాయి? అన్న వాటిపై చర్చిస్తున్నారు.
గత ఎన్నికల్లో గ్లాసు బోల్తా.!
- గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ
- గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్ ఓటమి
- భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి
గతంలో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు పవన్. పార్టీ అధ్యక్షుడిగా బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడానికి ఏడు-ఎనిమిది నియోజకవర్గాలు పరిశీలన చేసినా చివరకు కాకినాడనే చాయిస్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి
భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment