ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ దుర్మరణం
Published Thu, Nov 10 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
కావలిఅర్బన్ : ట్రాక్టర్ అదుపుతప్పి పడి డ్రైవర్ దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన మండలంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆనెమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీకి చెందిన చిట్టేటి సురేష్ (25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రుద్రకోటకు చెందిన జగదీశ్వరరెడ్డి వద్ద ట్రాక్టర్ తీసుకుని నారుమడులు దున్నేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి పొలాల్లో వేసిన రోడ్డుపై వస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement