నల్గొండ: నల్గొండ జిల్లా పెన్పహాడ్ మండలం దుబ్బగూడెంలో దారుణం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇసుక ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. గ్రామస్థులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై గ్రామస్తులు .. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించలేదు. దీంతో గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.