
నవీన
హుస్నాబాద్: ట్రాక్టర్ బోల్తాపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన నవీన(20) వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో తండ్రికి సహాయ పడేందుకు వెళ్లింది. వరినారు చేరవేసేందుకు నవీన ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్‌పై నారు వేసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం ఒడ్డు వద్దకు చేరుకుంది. ఒడ్డుపై ఉన్న ట్రాక్టర్‌ను కొంత వెనుకకు తీసుకురావాలని తండ్రి కోరగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. నవీనపై ట్రాక్టర్ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment