- ఇద్దరు రైతులు మృతి
నర్మెట: వరంగల్ జిల్లా నర్మెట మండలం గండిరామవరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. గండిరామవరానికి చెందిన ఇద్దరు రైతులు పొలంలో ఉన్న వరిగడ్డిని తీసుకు వచ్చేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు. వారి ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకు పోయింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న రైతులు నూన్సావత్ బోడ్యా, అజ్మీరా లోక్యా అక్కడికక్కడే మృతి చెందారు.