
ధ్వంసమైన కారు
చైతన్యపురి: నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో శనివారం ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. అయితే ఈ ఘటనలో రెండు కార్లు, ఐదు బైక్‌లు ధ్వంసం కాగా అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గణేశ్‌పురి కాలనీలోట్రాక్టర్‌లో బిల్డింగ్ వ్యర్థాలను తీసుకెళ్తున్న డ్రైవర్ లింగయ్యకు ఫిట్స్ వచ్చి డ్రైవింగ్ సీటునుంచి కిందికి పడిపోయాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన బైక్‌లు, కార్లను ఢీకొంటూ వెళ్లి ఆగింది. ఫిట్స్ తో కిందపడిపోయిన లింగయ్యను స్థానికులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జానకిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment