పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి | One killed in tractor turns in crop cultivating | Sakshi
Sakshi News home page

పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

Published Wed, Aug 19 2015 7:40 PM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM

పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి - Sakshi

పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాలలో బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో యజమాని భారతపు సమ్మయ్య (32) అక్కడిక్కడే మృతిచెందాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సమ్మయ్య రోజూ మాదిరిగానే బుధవారం సముద్రాలలోని సొంత పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు.

అక్కడ కేజీవీల్స్ బిగించి దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ బురదలో దిగబడింది. ఈ క్రమంలో ఎక్స్‌లేటర్‌ను ఒక్కసారిగా తొక్కడంతో ట్రాక్టర్ ఇంజన్ లేచి బోల్తా పడింది. దానికిందనే ఇరుక్కుపోయిన సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య స్వర్ణలత, తొమ్మిదిరోజుల కూతురు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement