మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
దేవరాపల్లి(మాడుగుల): మరో రెండు నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరుకోవలసిన ఆ ఇద్దర్నీ వారు ప్రయాణిస్తున్న ట్రా క్టర్ రూపంలో మృత్యువు çకబళించి, వారి కుటుంబ సభ్యులకు తీరని వ్యథను మిగి ల్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మామిడిపల్లికి చెందిన సన్నకారు రైతు గొర్లి నాయుడు పశువుల పాక నిర్మించేందుకు తాటి కమ్ములు(పాక నిర్మాణానికి ఉప యో గించే దూలాలు) నిమిత్తం గ్రామానికి చెందిన కార్పెంటర్ పెదగాడి కామేశ్వరరావుతో కలిసి ఎం.అలమండ వెళ్లారు. అక్కడ కొట్టించిన తాటి దుంగలను ట్రాక్టర్‌పై లోడు చేసి తారువా మీదుగా స్వగ్రామం మామిడిపల్లి బయలుదేరారు. తారువా కాలనీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి ఎడమ పక్కన లోతుగా ఉన్న సరుగుడు తోటవైపు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఇంజిన్ నుంచి తొట్టి భాగం విyì పోయింది. తాటి దుక్కలపై ఎక్కి కూర్చొని ప్రయాణిస్తున్న గొర్లినాయుడు(38),కార్పెం ట ర్ పెదగాడి కామేశ్వరరావు(50) దుక్కలు కిం ద చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తు న్న వారు గమనించి, వారిని అతికష్టంమీద బయటకు తీసేసరికే మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.దేవరాపల్లి, ఏ.కోడూరు ఎస్‌ఐలు పి. నర్సింహమూర్తి, ఏ.సత్యనారాయణ, చోడవరం సీఐ ఎం.శ్రీని వాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పొక్లెయిన్‌తో బయటకు తీయిం చారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాల ను చోడవరం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే బూడి పరామర్శ
ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు మరణించారన్న వార్త తెలుసుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనా యుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి పెద్ద దిక్కలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంచనామా జరిపి, త్వరతిగతిన పోస్టుమార్టం నిర్వహించేలా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే పోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న భీమా సొమ్ము సకాలంలో అందేలా తన వంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
పిల్లలను ఎలా చదివించాలి
కార్పెంటర్ పెదగాడి కామేశ్వరరావు వృత్తి ద్వారా రోజూ సంపాదించే కూలి సొమ్ముపైనే ఆ కుటుంబమంతా ఆధారపడి జీవిస్తోంది. రెక్కాడితే డొక్కాడని కార్పెంటర్ వృత్తిలో భాగంగా కూలి పని నిమిత్తం తాటి కమ్ములు కోయించేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కామేశ్వరరావుకు భార్య కాసులమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేయగా రెండవ కుమార్తె లత వేచలం హైస్కూల్‌లో పదో తరవగతి చదువుతోంది. కుమారుడు పెందుర్తిలో ఐటీఐ చదువుతుండగా ఎలక్ట్రికల్ సామగ్రి కనుగోలు నిమిత్తం శుక్రవారం గుంటూరు వెళ్లాడు. ఇద్దరు పిల్లల చదువులతో పాటు పోషణ, పెళ్లిళ్లు ఎలా చేయాలని మాకు దిక్కెవరంటూ భార్య కాసులమ్మ భోరున విలపించింది.
ఇదరు ఆడ పిల్లల్ని ఎలా పోషించాలి ..
గొర్లి నాయుడుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు దీపు(8), గ్రీసు(5) ఉన్నారు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు చిన్న పాటి టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టికొస్తున్నాడు. అయితే కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేర గట్టెక్కెందుకు పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పశువుల పాక నిర్మించేందుకు తాటి కమ్ములు తీసుకొచ్చేందుకు వెళ్లి మృత్యువు వాత పడడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. తమకు దిక్కెవరని, తన ఇద్దరి పిల్లల్నీ ఎలా పోషించాలంటూ భార్య వెంకట లక్ష్మి గుండెలవిసేలా రోదించింది. తండ్రి మృత దేహం వద్ద దీనంగా కూర్చున్న చిన్నారులు చూసిన పలువురు కంటతడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment