- ఉప్పర్‌పల్లిలో ఘటన l
- కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
చేగుంట: ట్రాక్టర్ కిందపడి మూడేళ్ల బాలుడు నలిగిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన మండలంలోని ఉప్పర్‌పల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన చింతల శ్యామల, చంద్రం దంపతులు. వీరికి ఒక్కగానొక్క సంతానం రేవంత్(3). మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు.
అదే దారిలో వచ్చిన ట్రాక్టర్ కింద బాలుడు నలిగిపోయాడు. డ్రైవర్ చూసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార ్టం నిమిత్తం బాలుడి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరళించినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.