ధర్మవరం అర్బన్: ధర్మవరం చెరువు మరువ వద్ద ఆదివారం రాత్రి ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో మల్లాకాలువ గ్రామానికి చెందిన బోయ గంగాధర్(23) మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. ధర్మవరం పట్టణానికి ఇసుక తీసుకొచ్చి తిరిగి ఖాళీ ట్రాక్టర్‌లో మల్లాకాలువ గ్రామానికి వెళుతుండగా రెండో మరువ వద్ద ప్రమాదం జరిగింది. సీఐ హరినాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నారాయణస్వామిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.