సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రాజాం పట‍్టణంలో ఇసుక ట్రాక‍్టర్ శనివారం ఉదయం బీభత‍్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్రాక‍్టర్ దూసుకురావడంతో రోడ్డుపై ఆడుకుంటున‍్న చందు(13) అనే బాలుడు అక‍్కడికక‍్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో రాజేష్ అనే మరో బాలుడు గాయపడ్డారు. రాజేష్‌ను చికిత‍్స నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment