
మహేష్ మృతదేహం
అయిజ (అలంపూర్) : ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని పెద్ద ధన్వాడకు చెందిన మద్దిలేటి, సుజాత దంపతుల కుమారుడు మహేష్(15), హరికృష్ణలు మంగళవారం స్వ గ్రామం నుంచి అయిజకు బైక్‌పై వస్తుండగా చిన్నతాండ్రపాడు వద్ద వెనకనుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. మహేష్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్ నడుపుతున్న హరికృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటనపై కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించినట్టు ఏఎస్‌ఐ శేషిరెడ్డి తెలిపారు.