ట్రాక్టర్‌ కింద పడి వృద్ధురాలు మృతి | Woman crushed under tractor wheels | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కింద పడి వృద్ధురాలు మృతి

Published Sun, Oct 30 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

Woman crushed under tractor wheels

ఆత్మకూరురూరల్‌ : ట్రాక్టర్‌ కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని దేపూరు శుక్రవారం రాత్రి జరిగింద చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చెందిన వై ఎల్లమ్మ (పుల్లమ్మ )(78) రజక వృత్తి చేసుకుంటూ జీవిస్తుంది. శుక్రవారం ఆత్మకూరుకు వచ్చి కొన్ని దుస్తులు తీసుకుని గ్రామానికి వెళ్తుంది. అదే సమయంలో సిమెంట్‌ ఇటుకలు, వరలు వేసుకుని వస్తున్న ట్రాక్టర్‌ వెనక్కు వచ్చే క్రమంలో వృద్ధురాలిని ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌ వెనుక చక్రాలు ఆమె రెండు కాళ్లపై వెళ్లడంతో నుజ్జునుజ్జు అయి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆత్మకూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతదేహానికి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో  పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement