
మొరెనా: మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15మంది మృత్యువాతపడ్డారు. గ్వాలియర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 20 మంది జీపులో ఘుర్గాన్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే సంతాప కార్యక్రమానికి వెళ్తున్నారు. వీరి వాహనాన్ని మొరెనా జిల్లా గంజ్‌రాంపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 12 మంది అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు మొరెనా ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూశారు. మిగతా ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment