
దుబ్బాక టౌన్: ‘అమ్మా నేను ఇంటికొస్తున్నా.. బాధపడకు.. హైదరాబాద్‌లో దోస్తుల వద్దకు వెళ్లా.. ఈ రోజు వస్తున్నా’ అని తల్లికి ఫోన్ చేసి చెప్పిన కాసేపటికే ఓ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు విగతజీవిగా మారిన విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన శ్రీరాం రవిశేఖర్, జ్యోతి దంపతుల కుమారుడు నవకాంత్ ఈ నెల 3న ఇంట్లో ఎవరికీ చెప్ప కుండా వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వెతికి నా అతని ఆచూకీ దొరకలేదు.
ఈ క్రమంలో 5 రో జుల తర్వాత ఆదివారం అతను తల్లికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నా ఏం ఆందోళన చెందొద్దంటూ చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాయంత్రానికే అతను కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా రైల్వే పోలీసులు నవకాంత్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంటికొస్తున్నా అని చెప్పిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ‘అయ్యో ఎంత పని చేస్తివి కొడుకా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
(చదవండి: చిత్తూరు యువకుడి విషాదాంతం )
Comments
Please login to add a commentAdd a comment