కామారెడ్డి : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఈద్గా వద్ద పట్టాలు దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీకొని ముగ్గురు చనిపోయారు. మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన బాలవ్వ, ఆమె మనువడు సవేంద్ర (4), కామారెడ్డి జిల్లా బీక్నూర్‌కు చెందిన నవ్య(19)లు గా గుర్తించారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి సెలవుల కావడంతో బాలవ్వ మనువడిని సొంత ఊరికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నవ్య కామారెడ్డిలో వశిష్ట కాలేజిలో బీకాం చివరి సంవత్సరం చదువుతుంది.
Comments
Please login to add a commentAdd a comment