
దోమకొండ నిజామాబాద్ : మండలంలోని అంచనూర్ గ్రామానికి చెందిన గుండు మహిపాల్(44) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ లింబాద్రి తెలిపారు. మృతుడు మహిపాల్‌కు 2003లో వివాహం కాగా భార్య కల్పన పుట్టింటికి వెళ్లిపోయి వరకట్నం కేసు పెట్టిందని తెలిపారు.
తిరిగి 2011లో మరో వివాహం చేసుకోగా భార్య కాపురానికి రావడం లేదన్నారు. రెండు పెళ్లిళ్లు జరిగిన సంసార జీవితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చేంది ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడు గ్రామంలో కరెంట్ మోటార్ల మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment