
ట్రాక్టర్ నడుపుతున్న వైద్యుడు శ్రీరాం
సాక్షి, పెద్దపల్లి కమాన్: కరోనాతో చనిపోయిన వ్యక్తుల విషయంలో వైద్యులు మానవత్వం చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం ప్రభుత్వాస్పత్రిలో కరోనా తో చనిపోయాడు. మృతదేహాన్ని తీసేయాలని పట్టుబట్టడంతో.. ఆస్పత్రి అధికారులు మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మున్సిపాలిటీకి చెందిన చెత్తతీసుకెళ్లే ట్రాక్టర్‌ను డ్రైవర్ ఆస్పత్రి ఐసోలేషన్‌వార్డు ముందుకు తెచ్చి అక్కడే వదిలి వెళ్లిపోయా డు. దీంతో కరోనా జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీరాం, మృతదేహాన్ని సిబ్బంది సాయంతో ట్రాక్టర్‌లోకి ఎక్కించి, తానే నడుపుతూ శ్మశాన వాటి క వద్దకు తీసుకెళ్లి దహనసంస్కారాలు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment