రోమ్: 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్ ఇవ్వబోమని ఇటలీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అదే క్రమంలో ఈ ఇటీవల మే 25 న ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఓ టీనేజర్ కెమిల్లా కనేపా (18) రక్తం గడ్డకట్టి మరణించాడు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అత్యంత అరుదుగా మాత్రమే సంభవించే ఈ రుగ్మత కారణంగా అతను మృతి చెందాడు.
ఇక మీదట ఆస్ట్రాజెనెకా టీకా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు ఆ దేశ ప్రత్యేక కోవిడ్ -19 కమిషనర్ ఫ్రాన్సిస్కో ఫిగ్లియులో విలేకరులతో అన్నారు. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు పొందిన 60 ఏళ్లలోపు వారికి రెండవ డోసుకు వేరే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య వైద్య సలహాదారు అదే విలేకరుల సమావేశంలో అన్నారు. అనేక యూరోపియన్ దేశాల మాదిరిగానే, ఇటలీ కూడా ఈ టీకా కారణంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఈ టీకా నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment